ఏ వెలుగులకీ ఎన్టీఆర్ కుటుంబ రాజకీయాలు!

రాజకీయాల్లో ఒక కుటుంబం ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి అదే కుటుంబ సభ్యులు సినిమా అవతారంతో రాజకీయాల్లోకి తల దూర్చడం ఎంతవరకు సబబని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న భయంతో చంద్రబాబు నాయుడు నందమూరి అందగాళ్ళను రంగానికి సిద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయోగం ప్రజలను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం.
జూనియర్ ఎన్టీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో ప్రచారం చేయడం వల్ల అక్కడ టిడిపి అభ్యర్ధిగా కొడాలి నాని గెలుపొందారని చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు, కనీసం ఇప్పుడు నమ్ముతున్నట్టు నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రభావం రాయలసీమలో బాగా ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన వారు అటు కాంగ్రెస్ లో ఇటు తెలుగు దేశంలో పదవులు అనుభవిస్తూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సామాన్య ప్రజలకు వెగటుగా ఉండడం సహజం.












Click it and Unblock the Notifications