ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారును ఊపేస్తున్న రంభ తనపై ఐటమ్ గర్ల్ ముద్ర పడడంపై మనసు నొచ్చుకుంటోంది. వాటిని ఐటమ్ గర్ల్ పాత్రలు కావని గెస్ట్ రోల్స్ అని ఆ భామామణి కొత్త నిర్వచనం ఇస్తోంది. యమదొంగ, దేశముదురు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో రంభ తన ఒంపుసొంపులను ఒలకబోయడానికి ఏ మాత్రం వెనకంజ వేయలేదు. అవకాశాలు సన్నగిల్లడంతో తిరిగి తన ఉనికిని చాటుకోవడానికి ఆమె టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ లకు ఒళ్లారబోస్తూ స్టెప్పులేయడానికి సిద్ధపడింది. ప్రతిష్ఠాత్మకమైన బ్యానర్లు నిర్మిస్తున్న చిత్రాలు కావడంతో తాను ఐటమ్ నెంబర్స్ లో నటించడానికి అంగీకరించానని, ఐటమ్ గర్ల్ గా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని చెబుతోంది. దొంగ సచ్చినోడు సినిమాలో రంభ కృష్ణ భగ్వాన్ సరసన రంభ నటిస్తోంది. తాను పాత్రలను ఎంపిక చేసుకోవడంలో రెండింతలు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె నమ్మించాలని చూస్తోంది. తాటి చెట్టు కింద కూర్చోని పాలు తాగుతున్నానని చెప్తే ఎలా ఉంటుందో రంభ మాటలు ఆ విధంగా ఉన్నాయని ముక్కు మీద వేలేసుకుందామా.