చిరు ప్రత్యర్ధులు రోజా, రాజశేఖర్ లా?

"నాకు చంద్రగిరి టికెట్ ఇచ్చే అవకాశం లేదంటే దాని అర్ధం నన్ను చిరంజీవి మీద పోటీ పెడతారని అనుకోవాలి" అని రోజా ఈ మధ్య వ్యాఖ్యానించింది. చిరంజీవి మూడు స్ధానాలకు (కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని) పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే ఆయనపై తెలుగుదేశం అభ్యర్ధి రోజా కావచ్చు. మరో వైపు కాంగ్రెస్ ఆదేశిస్తే చిరంజీవి మీద పోటీ చేయడానికి సిద్ధమని హీరో రాజశేఖర్ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ లో హేమాహేమీలు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ టికెట్ లభించే అవకాశాలు తక్కువ. ఈ ముగ్గురు స్టార్లు ఒకవేళ ఒకేస్ధానం నుంచి ఢీకొంటే? ఫలితాన్ని తేలిగ్గా ఊహించుకోవచ్చు.












Click it and Unblock the Notifications