వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి సీన్ అంతేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
"కన్న పిల్లలను క్రమశిక్షణతో పెంచుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా?" అని తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు చిరంజీవిని విమర్శిస్తున్నారు. చిరంజీవి ఉపన్యాసాల్లో రాజకీయ పరిపక్వత కన్పించకపోవడంతో ఉభయ పార్టీల నాయకులు అదొక ఫ్లాప్ సినిమా అన్న తరహాలో చిరంజీవి మీద చెలరేగిపోతున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం ఎన్నికలు రాకముందే రోజు రోజుకు క్షీణించిపోవడం ఆ పార్టీ "మేధావుల"కు ఆందోళన కలిగిస్తోంది. పార్టీ ప్రారంభమైన ముహుర్తం బాగుండలేదా అనే సందేహంతో ఆ పార్టీ ముఖ్యులు జ్యోతిషులను సంప్రదిస్తున్నారు. జ్యోతిషులు కూడా ఈ మధ్య ఆయా పార్టీలకు అభిమానులు కావడంతో ప్రజారాజ్యం మేధావులకు సరైన జ్యోతిష సలహా లభించడం లేదు.

చిరంజీవికి ఆ రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్దగా ఓట్లు పడే సీన్ కన్పించడం లేదు. సొంత ఊరు మొగల్తూరులో చిరంజీవి కటౌట్లు కన్పించడం లేదు. అయితే అనూహ్యంగా రాయలసీమ జిల్లాల్లో బలిజ ( కాపు ఉపకులం)ల ఓట్లు కట్ట కట్టుకుని చిరంజీవికి పడే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద చిరంజీవికి 30 కి మించి అసెంబ్లీ స్ధానాలు రావని కాంగ్రెస్, తెలుగుదేశం మేధావులు ఘంటాపథంగా చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X