రాజుగారి అప్పుల బాధ!

"మనసంతా నువ్వే", "వర్షం", "నువ్వు వస్తానంటే నేనొద్దంటానా" వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఎం ఎస్ రాజు ఆ డబ్బులను సత్యం కంప్యూటర్స్ షేర్లలో, కొంపల్లి (రామలింగరాజు ఫామ్ హౌస్ సమీపంలో) లో 20 ఎకరాల పొలానికి వెచ్చించినట్టు తెలుస్తోంది. సత్యం షేర్లపై పెట్టిన కోట్లాది రూపాయలు ఇప్పుడు చిత్తు కాగితాల్లా మారిపోయాయి.
ఆ ఇరవై ఎకరాల విలువ ఒకప్పుడు 40 కోట్లు కాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ధరల పతనం కారణంగా వాటి విలువ సగానికి సగం పడిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల "మస్కా" చిత్రం కోసం ఆ పొలాన్ని ఒక ఫైనాన్సర్ కు తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టినట్టు తెలిసింది. రాజుగారు అప్పుల బాధ నుంచి కోలుకుని మనకు మరిన్ని మంచి చిత్రాలు అందిస్తారని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications