టీవీ9 చొరవ, కొత్త గొడవ!

మూడు రోజులుగా టీవీ9లో సహాయనిధి కోసం వస్తున్న యాడ్స్ కు స్పందన బాగా ఉంది. ఈ స్పందనను స్ఫూర్తిగా తీసుకుని టీవీ9 ఇంకా ముందుకు వెళ్ళి ఫ్యాక్షనిస్టులకు నీతి పాఠాలు చెబుతోంది. "మీరు ఎంతో అక్రమంగా సంపాదించారు. సీమ జిల్లా అయిన కర్నూలును ఆదుకుని మీ పాపాలను కడుక్కోండి" అని టీవీ9లో వస్తున్న స్క్రోలింగ్స్ పై మిశ్రమ స్పందన కన్పిస్తోంది.
తామే కాదు, మీడియాతో సహా అనేక రంగాల వారు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని, ముందు మీడియా ప్రతినిధులు వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించాలని కర్నూలు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. తన పేరు రాయవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications