మళ్ళీ ఉండవల్లి వ్యూహాలు!

వైఎస్ మరణం ఉండవల్లిని బాగా కుంగదీసింది. అయినా ఆయన తేరుకుని సోనియా గాంధీ వచ్చే సమయానికి హైదరాబాద్ చేరుకుని ఆమె వెంటనే ఉన్నారు. మొన్న సోనియా గాంధీని కలిసిన ఉండవల్లి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ది పై ఆమెకు కొంత సమాచారం అందించినట్టు సమాచారం. వైఎస్ వంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోలేమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగానే ఆయన చెప్పినా సోనియాగాంధీ అందుకు అనుకూలంగా స్పందించలేదని, అందువల్ల ఆ విషయంలో పట్టుబట్టకుండా ఉండవల్లి బయటపడినట్టు సమాచారం. వైఎస్ కాకుండా ఆ కుటుంబానికి చెందని మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఉండవల్లి వ్యూహాలు నడవవు. ఆయనకు మళ్ళీ టికెట్ వచ్చినా గెలుపు కష్టమవుతుంది. అందువల్ల ఈ అపర చాణుక్యుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications