కెసీఆర్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది?

ఆయా పార్టీల కార్యకర్తలు తప్ప సామాన్య జనం ఈ ఉద్యమంలో లేరు. కెసీఆర్ నిరాహార దీక్ష సమయంలో కూడా హైదరాబాద్ లోని స్ధానికులు బస్ధీల నుంచి పెద్దగా బయటికి రాలేదు. కెసిఆర్ ఉద్యమం కూడా విద్యార్ధులకు, ఉద్యోగులకు పరిమితమైంది. మొదటి నుంచి హింసా రహితంగా ఉద్యమం సాగించాలని కెసిఆర్ చెబుతూ వస్తున్నారు. ఉద్యమం హింసాయుతంగా మారితే స్టీరింగ్ ఎవరి చేతుల్లోనూ ఉండదు.
ఈ పరిస్ధితిలో కెసిఆర్ గాంధీగిరికి పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో దశాబ్దాలు ఎదురు చూశారు కాబట్టి మరో నాలుగేళ్లు ఓర్చుకోవడం పెద్ద విషయం కాదని ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. ఈలోపు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తే దానికంటే నాలుగేళ్ళు వేచి ఉండి హైదరాబాద్ తో సహా తెలంగాణను సాధించుకోవడమే ఉత్తమమని కెసిఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్రం చేయబోయే స్పష్టమైన ప్రకటన ద్వారానే అన్ని విషయాలు స్పష్టమౌతాయి.












Click it and Unblock the Notifications