చిరుపై బాబు మళ్లీ రుసరుస!

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తమ అవసరం రాదని ప్రజారాజ్యం భావించి ప్రతిపక్షంగానే ఉంటామని చెప్పింది. అయితే కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినుండి కిరణ్ ప్రభుత్వానికి ముప్పు ఉందని తెలిసి మళ్లీ చిరంజీవి పాత పాడుతున్నారు. దీంతో చంద్రబాబునాయుడు మళ్లీ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలుపేస్తాడని, చిరంజీవి పార్టీ స్థాపించినప్పటికీ ఆయన కాంగ్రెస్ వ్యక్తేనని చంద్రబాబు గతంలో విమర్శించారు.
తాజా చిరంజీవి పొంతన కుదరని ప్రకటనలతో చంద్రబాబుకు అవకాశం దొరికింది. గతంలో తాను చిరంజీవి కాంగ్రెస్ వ్యక్తి అని తాను చెప్పిన మాటలు నిజమని ప్రజల ముందుకు తీసుక వెళ్లవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానన్న చిరంజీవి మంత్రివర్గంలో చేరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తాడని ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications