చిరంజీవి మార్కు న్యూస్

నిజానికి, దినపత్రిక తేవాలని చిరంజీవికి సూచనలు చేశారట. అయితే, సి. రామచంద్రయ్య, కోటగిరి విద్యాధర రావు వంటి సీనియర్ నాయకులు అది సరిపడదని చెప్పారట. న్యూస్ బులిటెన్ తెస్తే బాగుంటుందని, అది కూడా పక్షానికి ఒక్కటి తెస్తే చాలునని చెప్పారట. దాంతో చిరంజీవి దీనికి సెటిలైపోయారని చెబుతున్నారు. అందులో ఏ విధమైన వార్తలు, వార్తాకథనాలు ఉంటాయని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ రాజకీయ, సామాజిక కార్యక్రమాలను అందులో ఇస్తారు. పార్టీపై వస్తున్న రాజకీయ, ఇతర విమర్సలను అందులో చీల్చిచెండాడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి మీద ఈగ వాలినా కలం పోటుతో గట్టిగా సమాధానం చెప్తారని మనం భావించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications