రాజకీయం ఇంకా తెలియని చిరు!

గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజారాజ్యం ముఖ్యుడు ఒకరు కొన్ని వందల కోట్లు టికెట్ల పేరుతో వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. టికెట్లు రాని వారికి ఇటీవల వరకు వాయిదాల పద్ధతిలో తిరుగు చెల్లింపులు చేశారు. పార్టీకి చాలా జిల్లాల్లో సొంత కార్యాలయాలు లేరు. మిగితా జిల్లాల్లో ఆయా ఇన్ చార్జులనే అద్దెలు కట్టుకోమంటున్నారు. ఎన్టీఆర్ కు కూడా అలా చేయలేదు. ఆయన జిల్లా కార్యాలయాలను పార్టీయే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు.
చిరంజీవి రాజకీయంగా కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులు చేశారు. ఆయన ఇప్పటికీ హీరోలా వ్యవహరించడం వల్ల కొందరు ప్రొడ్యూసర్లు, కొందరు స్కిప్టు రైటర్లు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications