ఎన్టీఆర్ వైయస్సార్ ల మధ్య పోటీయా?

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా, పేదల పాలిట పెన్నిధిగా ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. తెలుగు సమాజంలో ఎన్టీఆర్ ను మించిన నాయకుడు లేరనే మాట కూడా వినిపిస్తోంది. ఈ సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ కు మించిన నాయకుడిగా నిలబెట్టేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే, దాన్ని కాంగ్రెసు పార్టీ పరిమితుల్లో కాకుండా తన సొంత వ్యవహారంగా జగన్ చూస్తున్నారు. దీంతో పురంధేశ్వరి దంపతులు, జగన్ మధ్య వైరం చోటు చేసుకుందని భావించాల్సి ఉంటుంది. పైగా, జగన్ కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా ఆశీస్సులు లేవు. పురంధేశ్వరికి దండిగా ఉన్నాయి. దీంతో సహజంగానే పురంధేశ్వరిది పైచేయి అవుతుంది. దాంతో జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక పురంధేశ్వరిని, దగ్గుబాటి వెంకటేశ్వర రావును తీవ్రంగా నిందిస్తూ రెండు వార్తాకథనాలు ప్రచురించిందని అంటున్నారు. వైయస్ ఎన్టీఆర్ పథకాలనే కాపీ కొట్టి పేదల ఆత్మబంధువుగా నిలబడేందుకు ప్రయత్నించారు. అయితే వాటి పేర్లు మాత్రం మార్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications