• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు పెద్ద పరీక్ష

By Santaram
|

KVP Ramachandar Rao
హైదరాబాద్: వైయస్ ఆప్త మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు జీవన్మరణ సమస్య ఎదురైంది. అధిష్ఠానం వద్దంటున్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లిన జగన్‌ వ్యవహారశైలిని నాయకత్వం ఓ వైపు నిశితంగా పరిశీలిస్తోంది. యాత్రపై పూర్తి స్థాయి నిఘా పెట్టింది. మరోవైపు సోనియా, రోశయ్య తీరుపై జగన్‌ వర్గీయుల నుంచి విమర్శల దాడి ఉధృతమ వుతోంది. ఈ క్రమంలో జగన్‌ కాంగ్రెస్‌ (వైయస్‌) పార్టీని స్థాపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ కు ఆత్మబంధువుగా ముద్ర ఉన్న కేవీపీ ఎటువైపు నిలుస్తారన్న అంశంపై పార్టీలో చర్చ ప్రారంభమయింది. వైయస్‌ మృతి చెందిన తర్వాత కేవీపీ హవా తగ్గిపోతుందని, రోశయ్య ఆయనను పక్కకుబెడతారని తొలుత ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే కేవీపీ కూడా రోజూ జగన్‌ నివాసానికి వెళ్లి మంత్రాంగం నడపడం అలాంటి ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే, ఆశ్చర్యకరంగా..రోశయ్య మునుపటి మాదిరిగానే కేవీపీకి ప్రాధాన్యం కొనసాగించారు. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరు, ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, ఇతర వ్యవహారాల్లో వైయస్‌ ఉన్నప్పుడు ఏ స్థాయిలో హవా సాగించారో ఇప్పుడూ దానినే కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభ ఇంకా వెలుగుతూనే ఉంది.

రోశయ్య కూడా 'అన్ని వ్యవహారా ల్లో" కేవీపీపైనే ఆధారపడి, ఆయనకు అందరి కన్నా ఎక్కువే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాస్తవం స్పష్టమవుతోంది. 'అధిష్ఠానం అవస రాలు తీర్చే" అంశంలో కేవీపీ పాత్రను కొన సాగించాలన్న ఢిల్లీ సంకేతాల మేరకే ఆయనకు పాత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పార్టీ సీనియర్ల ఉవాచ. ముఖ్యమంత్రి కూడా కేవీపీ వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించారు. వైయస్‌ మృతి చెందిన తర్వాత కూడా కేవీపీకి ప్రాధాన్యం ఇవ్వడంపై తెలంగాణ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం మాత్రం లౌక్యంగా ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యం వారికి ఇస్తానని సర్దిచెప్పారు. ఆ విధంగా అటు జగన్‌ వ్యతిరేకవర్గంతో, ఇటు జగన్‌ అనుకూలుడైన కేవీపీతోనూ పని తీసుకుంటున్న వ్యూహాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

జగన్‌ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్నందున..ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురుచూసి, ఆ లక్ష్యసాధన కోసం పనిచేస్తున్న తన ఆప్తమిత్రుడి తనయుడు జగన్ ‌కు బాసటగా నిలుస్తారా లేదా అని నేతలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తన మిత్రుడు వైయస్‌ సీఎం కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్న కేవీపీ.. మిత్రుడి కుమారుడు కూడా సీఎం కావాలని కోరుకోరా అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమయి జగన్‌ స్థాపించే పార్టీలో కేవీపీ చేరితే.. కాంగ్రెస్‌ వల్ల సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అదే సమయంలో వైయస్‌ మాదిరిగానే తనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను గౌరవిస్తోన్న రోశయ్యను వదులుకుంటారా?..మిగిలిన వారంతా జగన్‌ పార్టీలో చేరితే..కేవీపీ ఒక్కరే దూరంగా ఉంటే వచ్చే విమర్శలను ఏవిధంగా ఎదుర్కొంటారు?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X