వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడకత్తెరలో పోకచెక్కలా మారిన డి శ్రీనివాస్

By Santaram
|
Google Oneindia TeluguNews

D Srinivas
పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ది ఇప్పుడు ధర్మసంకటమే. అధిష్టానవర్గం రహస్య ఆదేశాల మేరకు ఆయన వ్యవహరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రాజీనామాలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఉపసంహరింపజేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నిజానికి డి శ్రీనివాస్ గట్టి తెలంగాణ వాది. 2004 ఎన్నికల్లో టీఅర్ ఎస్ బలాన్ని ఎక్కువగా చూపించి గులాం నబీ ఆజాద్ తో ఎక్కువ సీట్లు ఇప్పించిన ఘనత ఆయనదే. ఆనాడు కాంగ్రెస్- టీఅర్ఎస్ పొత్తు విషయంలో డీఎస్ కీలకపాత్ర వహించారు. వైఎస్ ను హైకమాండ్ సంప్రదించలేదు. ఆనాడు డిఎస్ తీసుకున్న చొరవ వల్లనే టిఆర్ ఎస్ కేంద్రంలో బలపడడం, తద్వారా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఊపు రావడం జరిగాయి.

ఇప్పుడు తన మనసుకు నచ్చకపోయినా డీఎస్ తెలంగాణ ఎమ్మెల్యేలను కొంచెం తగ్గమని చెప్పవలసివచ్చింది. హై కమాండ్ కు డీఎస్ వీరవిధేయుడు. టిఆర్ ఎస్ ప్రభావం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉండదని, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ సిఎమ్మే ఉంటారని హైకమాండ్ వద్ద గట్టిగా చెబుతూ వస్తున్న వ్యక్తి డిఎస్. జెఎసిలో తెలుగుదేశం, టిఆర్ ఎస్ స్ట్రాంగా ఉన్నాయి. అటూ ఇటూగా ఉన్నది కాంగ్రెసే. ఇప్పుడు డిఎస్ పరిస్ధితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. రాజీనామాలు ఉపసంహరించుకోమంటే ఎమ్మెల్యేలకు, విద్యార్ధులకు కోపం. అలా చేయకపోతే హైకమాండ్ నుంచి తలపోటు. ఈనెల 28 నుంచి డిఎస్ బాధలు మరింత పెరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X