పురంధేశ్వరి జాక్ పాట్?

పార్టీ నాయకత్వం ఎవరికి అప్పగించేందుకు అవసరమైన సర్వేను కూడా సోనియా నిర్వహించారు. ఇందులో పురంధేశ్వరి, టి. సుబ్బరామిరెడ్డి, అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేర్లు ఉన్నాయి. అయితే, వీరిలో పురంధేశ్వరికే ఎక్కువ అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. సీమాంధ్రలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న రెండు సామాజిక వర్గాలను కూడా దగ్గరు చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాపు వర్గం మద్దతు తమకు లభిస్తుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వినికిడి. పురంధేశ్వరి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్టీఆర్ వారసత్వాన్ని స్వీకరించినట్లు సంకేతాలిస్తూ చంద్రబాబును దెబ్బ తీయవచ్చునని, అదే సమయంలో కమ్మ సామాజిక వర్గాన్ని చేరువ చేసుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో పురంధేశ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రలో బలోపేతం చేసుకోవచ్చునని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications