యాంకర్ ను బెదిరించిన సుబ్బిరామిరెడ్డి

T Subbirami Reddy
కాంగ్రెసు నాయకుడు టి. సుబ్బిరామిరెడ్డి ఓ టీవీ యాంకర్ ను బెదిరించారు. నీకు అది మంచిది కాదు, పరిమితులు దాటొద్దు అని ఆయన హెచ్చరిక చేశారు. తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్ గాంధీ లలిత కళాతోరణంగా మార్చడంపై ఓ టీవీ చానెల్ యాంకర్ ను సుబ్బిరామిరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్ లో గల లలిత కళాతోరణానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించుకుంటూ తెలుగు సందర్భశుద్ధిని కోల్పోయిందని, తెలుగు ఈ తరంలో స్థానమే లేదని అన్నారు. తనకు తెలుగు కన్నా రాజీవ్ గాంధీ ముఖ్యమని కూడా అన్నారు. దీనిపై యాంకర్ అశ్చర్యపోతూ మీ వాదనను ఎలా సమర్థించుకుంటారని అడగడంతో సుబ్బిరామిరెడ్డి తోక తొక్కిన తాచులా లేచాడు. నీ పరిమితి దాటొద్దని హెచ్చరించారు. అది నీకు సేఫ్ కాదని బెదిరించారు. నేను మళ్లీ చెప్తున్నాను, నీకు అది సేఫ్ కాదు అని సుబ్బిరామిరెడ్డి ఎగిరి గంతేశాడు.

టీవీ9కు మరో షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అంతకు ముందే ఓ షాక్ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించడానికి కాకుండా ఇద్దరు వ్యక్తులను చర్చకు పిలిచి వివాదాన్ని మరింతగా రెచ్చగొట్టడమే టీవీ9 పనిగా పెట్టుకుంది. దానికి అది మూల్యం చెల్లించినట్లే భావించాలి. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను కూలుస్తామని తెరాస నాయకుడు కెటి రామారావు చేసిన ప్రకటనపై చర్చ నిర్వహించింది. దానికి నాయని నర్సింహారెడ్డిని, ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ ను ఆహ్వానించింది. మీరెప్పుడు విగ్రహాలను కూలగొడతారని టీవీ9 ప్రతినిధి అడగడంతో నాయని నర్సింహారెడ్డి భగ్గుమన్నారు. శత్రుత్వాన్ని పెంచడానికి ఆంధ్రకు చెందినవారు అర్థం లేని ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారని నాయని నర్సింహారెడ్డి ఒంటికాలి మీద లేచారు. వివాదాలను రచ్చ చేయడం టీవీ చానెళ్లు చేయడం రాజకీయ నాయకులకు అసహనాన్ని తెప్పిస్తోందని అనడానికి ఇది మంచి ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+