గాలికి మరో దెబ్బ, భూమి వెనక్కి?

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ స్థాపనకు వైయస్సార్ ప్రభుత్వం 10,670 ఎకరాల భూమిని కేటాయించింది. దానికి వాడుకోవడానికి అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ఇనుప ఖనిజాలను కూడా కేటాయించింది. ఈ భూములను వెనక్కి తీసుకోవడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ న్యాయశాఖ అధిరాకుల సలహాను కోరింది. న్యాయశాఖ అభిప్రాయం రాగానే పరిశ్రమల శాఖ చర్యలు తీసుకుంటుంది. అయితే, ఈలోగా బ్రాహ్మణి స్టీల్స్ కోసం కేటాయించిన గనుల ద్వారా గాలి జనార్దన్ రెడ్డి ఎంతో లాభపడ్డారని లోకం కోడై కూస్తోంది.












Click it and Unblock the Notifications