వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కాశ్మీర్‌కు తక్కువ, గూర్ఖాలాండ్‌కు ఎక్కువ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ అంశం సమస్యను ఓ కొత్త తరహా విధానంతో పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వాలనుకుంటే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు, హైదరాబాదు లేని తెలంగాణ అవసరం లేదంటూ తెలంగాణ ప్రజలు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్న తరుణంలో కేంద్రం ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సైతం తెలంగాణ వెనుక బడి ఉందని చెబుతూనే రాష్ట్రం అవసరం లేదని ప్రత్యేక మండలి, ప్రత్యేక ప్యాకేజీలను సూచించాయి.

ఇటు తెలంగాణకు సీమాంధ్రులు ఒప్పుకోక పోవడం, హైదరాబాదులోని తెలంగాణకు తెలంగాణవారు ఒప్పుకోక పోవడంతో కేంద్రం జమ్ముకాశ్మీర్, గూర్ఖాలండ్ తరహా ప్యాకేజీతో ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. కేంద్రం జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఇటీవలే గూర్ఖాలాండ్‌కు స్వయం పాలనా ప్యాకేజీని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించి ఆమోదించారు. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని జమ్ము కాశ్మీర్‌కు తక్కువ, గూర్ఖాలాండ్‌కు ఎక్కువగా మరో కొత్త ప్రతిపాదనను కేంద్రం తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాశ్మీర్, గూర్ఖాలాండ్ రాష్ట్రాలు దేశ సరిహద్దులలో ఉన్నందున దేశభద్రత దృష్ట్యా తెలంగాణకు వాటికి సంబంధం లేదని తెలంగాణ వారి వాదన.

English summary
It seems, Central government is thinking to solve Telangana issue like Jammu Kashmir and Gorkhaland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X