వైయస్ జగన్‌పై జానీ ఆస్త్రం

YS Jagan
కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై వాడడానికి కాంగ్రెసు నాయకత్వానికి బ్రహ్మాండమైన అస్త్రం దొరికింది. ముస్లిం మైనారిటీ అయిన జానీని కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారానికి జగన్‌కు వ్యతిరేకంగా వాడుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సూచనప్రాయంగా చెప్పారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ముస్లిం ఓటర్లున్నారు. జానీని ఓడించడానికి వైయస్ జగన్ కుట్ర చేశారనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ నాయకులు పెద్దయెత్తున ప్రచారంలోకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. జగన్ పన్నిన వ్యూహం ఈ రకంగా కాంగ్రెసుకు కలిసి వస్తోంది.

మహ్మద్ జానీకి కడప జిల్లాతో పరిచయం ఉంది. ఆయన జిల్లా ఇంచార్జీ మంత్రిగా పనిచేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడుగా ఉండేవారు కూడా. కడప జిల్లాలోని ముస్లిం మైనారిటీల్లోకి చొచ్చుకుపోవడానికి జానీకి అంత కష్టం కాదు. పైగా, జానీ నోరున్నవారే. జానీకి కడప జిల్లా మంత్రి అహ్మదుల్లా కూడా తోడవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు జానీకి వేయాల్సిన ఓటును మజ్లీస్ అభ్యర్థి రిజ్వీకి వేసిన విషయం తెలిసిందే. ఓడిపోయే ప్రమాదాన్ని జానీ తృటిలో తప్పించుకున్నారు. దీంతో వైయస్ జగన్‌పై జానీ కడప ఉప ఎన్నికల్లో తోక తొక్కిన పాములా లేచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+