కాంగ్రెసు ప్లాన్‌కు కెసిఆర్ ట్యూన్

తెలంగాణపై ప్రాంతీయ మండలి వేసినా, నిర్ణయం ప్రకటించకపోయినా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. తెలంగాణలోని 119 శానససభా స్థానాల్లో తెరాసకు 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఇటీవలి నెల్సన్ - మార్గ్ సర్వే తెలిపింది. ఇది కెసిఆర్‌కు ఉత్సాహాన్ని ఇచ్చే ఇంశం. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం తేల్చకపోతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నికల సమయంలో మరింత మంది తమ పార్టీలోకి రావచ్చునని కెసిఆర్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే, అదే సమయంలో పార్టీలో విభేదాలు, అసంతృప్తి తలెత్తకుండా తగిన మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఆలస్యంగానైనా సరే, అదును చూసి కాంగ్రెసును దెబ్బ కొట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications