ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం శాసనసభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన శాసనసభ్యులు తమ ఇష్టానుసారమే ఓటు చేశారు. వైయస్ జగన్ మాటను వారు ఖాతరు చేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రాంగం కొంత మేరకు పనిచేసినట్లే. దాంతో కాంగ్రెసు అభ్యర్థి మహ్మద్ జానీ చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు బయటపడ్డారు. మజ్లీస్ అభ్యర్థి రజ్వీకి ఓటు వేసి కాంగ్రెసు అభ్యర్థిని దెబ్బ తీయాలని వైయస్ జగన్ చేసిన సూచనను పది మంది శాసనసభ్యులు ధిక్కరించారు. వీరవిధేయులైన శాసనసభ్యులు మాత్రమే జగన్ మాటకు కట్టుబడి జానీకి కాకుండా రజ్వీకి ఓటేశారు. ఈ విషయాన్ని గ్రహించిన కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే జానీకి కేటాయించిన కొన్ని ఓట్లను మహ్మద్ జానీకి మళ్లించారు. తాము ముఖ్యమంత్రికి మాట ఇచ్చామని, కాంగ్రెసు అభ్యర్థికి మాత్రమే ఓటేస్తామని కొంత మంది శాసనసభ్యులు మొహమాటం లేకుండా వైయస్ జగన్‌తో చెప్పి అలాగే చేశారు. ఎంతవారలైన గాని అనుకోవాల్సిందేనని అంటున్నారు.
Few MLAs gave shock to YSR Congress party leader YS Jagan in MLC election held in MLAs quota. They decided to hear CM Kiran Kumar Reddy's words and voted for Congress candidate opposing YS Jagan suggestion.
Story first published: Friday, March 18, 2011, 9:50 [IST]