బాబాను చంపింది ట్రస్టు సభ్యులేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu
Sathya Sai Baba
పుట్టపర్తి సత్యసాయి బాబాను చంపింది ట్రస్టు సభ్యులేనని మాజీ మంత్రి జి. నాగిరెడ్డి ఆరోపిస్తున్నారు. మానసికంగా హింసించి బాబాను ట్రస్టు సభ్యులే చంపారని ఆయన ధర్మవరంలో ఆరోపించారు. సత్య సాయి మృతిపై తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ట్రస్టు సభ్యులపై ఉందని ఆయన అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించే సమయంలో మార్చి 28వ తేదీన తనను రక్షించాలంటూ సత్య సాయిబాబా కన్నీటితో భక్తులను కోరినట్లు కొందరు ట్రస్టు సభ్యుల ద్వారా తనకు తెలిసిందని ఆయన అన్నారు.

ఆస్పత్రికి చేరకముందు బాబాకు అన్నం పెట్టకుండా హింసించారని ఆయన అంటున్నారు. సత్యసాయి బాబాకు అందించిన వైద్య సేవల వివరాలను, అడ్మిషన్ రిజిష్టర్ నకలుతో పాటు కేస్ షీట్, బాబాకు చేసిన శస్త్ర చికిత్స వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం కింద మే 6వ తేదీన సత్య సాయి సేవా ట్రస్టు ప్రజా సంబంధాల అధికారికి దరఖాస్తు చేశానని, తనకు సమాచారం ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Minister G Nagi Reddy accused Sri Sathya Sai trust members for the death of Sathya Sai Baba.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి