ఆదాయం పన్ను శాఖ అధికారుల సోదాల్లో బాలీవుడ్ భామామణులు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ పెద్ద యెత్తున ఆస్తులు కలిగి ఉన్నట్లు బయటపడిందని అంటున్నారు. ప్రియాంక చోప్రాకు ముంబైలో 8 నుంచి 10 ఫ్లాట్స్ ఉన్నాయట. వెర్సోవాలోని రాజ్ క్లాసిక్‌లో ప్రియాంకకు ఐదు ఫ్లాట్లు ఉన్నట్లు ఐటి అధికారులు కనుక్కున్నారు. మూడు ఫ్లాట్లను కలిపి ఒక్క ఫ్లాట్‌గా, మరో రెండు ఫ్లాట్లను కలిపి మరో ఫ్లాట్‌గా ఆ తార మార్చేసిందని తేలింది. మరో పెంట్ హౌస్‌ను, మూడు ఫ్లాట్లను అద్దెకు ఇచ్చిందని తేలింది. కత్రినా కైఫ్ స్టేజీ షోల ద్వారా సంపాదించిన సొమ్ము లెక్కలను కూడా ఐటి అధికారులు తేలుస్తున్నారు.