మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరంలో సినీ గ్లామర్ పెరుగుతున్నట్లే ఉంది. ఇప్పటికే, రోజా వంటి సినీ తారలు వైయస్ జగన్ శిబిరంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా దర్సకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు వైయస్ జగన్ తో చేతులు కలిపారు. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ పెట్ల ఉమాశంకర్ గణేష్ శుక్రవారం నర్సీంపట్నంలో జగన్ ను కలిసి మద్దతు ప్రకటించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల పేదలు ఎంతో ప్రయోజనం పొందారని గణేష్ అన్నారు. వైయస్ స్ఫూర్తితో జగన్ ముందుకు సాగుతారనే నమ్మకంతో మద్దతు తెలుపుతున్నట్టు వివరించారు. మరింత మంది సినీ ప్రముఖులు వైయస్ జగన్‌తో చేతులు కలుపుతారా అనేది వేచి చూడాల్సిందే.