సూరి కేసులో వర్మను విచారిస్తారా?

వర్మ తీసిన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడులు పెట్టారనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. సూరి అనుచరుడు భాను సినిమా నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మను పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో తెలుగు నిర్మాత సింగనమల రమేష్‌ను కూడా పోలీసులు విచారిస్తారని అంటున్నారు. భాను కిరణ్‌కు చెందిన ల్యాప్‌టాప్ తెరిస్తే టాలీవుడ్ సంబంధాలు బయటకు వస్తాయని అంటున్నారు. ల్యాప్‌టాప్‌ను తెరిచేందుకు దాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications