మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక మరోసారి తెలుగుదేశం పార్టీపై, ఈనాడు అధినేత రామోజీ రావుపై, కాంగ్రెసుపై దుమ్మెత్తి పోసింది. కాంగ్రెసు పార్టీ రామోజీరావును కౌగిలించుకుంటోందని ఆరోపించింది. కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో, రామోజీరావుతో కుమ్మక్కయి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఓ భారీ వార్తాకథనాన్ని సాక్షి ప్రచురించింది. చంద్రబాబు చేసిన భూకేటాయింపుల తప్పులకు కూడా వైయస్‌ను బాధ్యుడిని చేస్తోందని తప్పు పట్టింది. మంత్రివర్గ సమష్టి నిర్ణయాలకు కూడా వైయస్‌నే తప్పు పట్టే రాజకీయాలకు ఒడిగడుతోందని అన్నది. వైయస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారని విమర్శించింది. రామోజీరావు, కాంగ్రెసు, తెలంగుదేశం పార్టీలను మాయా కూటమిగా సాక్షి అభివర్ణించింది. మొత్తం మీద, కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసేందుకు అవసరమైన ఎత్తుగడలను అన్నింటినీ జగన్ అనుసరిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.
Sakshi daily belongs to YS Jagan accused Congress party that colluding with Ramoji Rao and Telugudesam trying tarnish YSR image. A news report is published today by Sakshi attacking Congress, Telugudesam and ramoji Rao.