గుర్రం స్వారీలో కిందపడిన నిత్యానంద

Swami Nityananda
నిత్యానంద స్వామి గారి వైభోగం ఇంతింత కాదయా అనేలా ఉంది. ఆయనగారు గుర్రం స్వారీ చేస్తారు. ఇది కూడా వ్యాయామంలో భాగంగానే అంటున్నారు. అయితే అది మంగళవారం ముప్పు తెచ్చి పెట్టింది. సినీ నటి రంజితతో రాసలీలలు నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామి నిత్యానంద గుర్రపు స్వారీ చేస్తూ గాయపడ్డారు.

వ్యాయామంలో భాగంగా మంగళవారం ఉదయం బిడిది సమీపంలోని ధ్యానపీటం ఆశ్రమంలో ఆయన స్వారీ చేశారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు గుర్రంపై నుంచి కిందపడటంతో నిత్యానంద కుడి చేతికి గాయమైంది. ఆశ్రమ సిబ్బంది వెంటనే ఆయనను నగరంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. నిత్యానందకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆశ్రమానికి చెందిన నిత్యసచ్చిదానంద స్వామిజీ మీడియా ప్రతినిధులకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+