ఈనాడుతో వైయస్ జగన్ బుక్‌లెట్

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంచి ఉపాయమే చేశాడు. తన ప్రత్యర్థులు నడుపుతున్న రెండు దినపత్రికల మధ్య ఓ లఘు పుస్తకాన్ని పెట్టించి, పంపిణీ చేయించారు. గురువారం హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. హ్యాకర్ల ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల మధ్య పెట్టిన జగన్ లఘు పుస్తకం చాలా మంది ఇళ్లకు చేరింది. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ ప్రచురించిన బుక్‌లెట్ అది.

అయితే, ఆ లఘు పుస్తకంలో కొత్త విషయాలేమీ లేవు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై, రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలు, సాక్షి దినపత్రికలో రాసిన వార్తాకథనాలు క్రోడీకరించి ఆ పుస్తకం రాసినట్లుంది. తనపై సిబిఐ దర్యాప్తు జరగడం రాజకీయ కుట్రలో భాగమని, వైయస్ హయాంలో జరిగిన నిర్ణయాలపై మంత్రివర్గం బాధ్యత వహించాలని అంటూ అందులో రాశారు. కొసమెరుపు ఏమిటంటే, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్ వ్యవహారాన్ని ఎత్తిచూపుతూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+