ఒకే దారిలో కనిమొళీ, వైయస్ జగన్

సరిగ్గా, కనిమొళి దారిలోనే వైయస్ జగన్ నడిచారని ఆయన ప్రత్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం కూడా లేకపోలేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను పెద్దలకు కట్టబెట్టి ఆ పెద్దల ద్వారా తన సంస్థల్లో వైయస్ జగన్ పెట్టుబడులు పెట్టించుకున్నారని, తద్వారానే ఆయన దేశంలోనే అతి పెద్ద రాజకీయ కుబేరుడిగా ఎదిగారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఏయే రూపాల్లో ఎప్పుడెప్పుడు ప్రవహించాయో కూడా పత్రికలు, ప్రతిపక్షాలూ బయటపెట్టాయి. ఏమైనా, న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని అంటే అది ఎవరి తప్పూ కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications