అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మంత్రి శంకరరావుపై కోపాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై చూపిస్తున్నారు. తన ఆస్తులపై శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించిన నేపథ్యంలో జగన్ చంద్రబాబు ఆస్తులపై పడ్డారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గురునాథ రెడ్డి, కె. శ్రీనివాసులు - చంద్రబాబు వ్యవహారాలపై హైకోర్టుకు లేఖలు రాశారు. రిలయన్స్ లావాదేవీలపై ఈనాడు అధినేత రామోజీరావుపై, చంద్రబాబుపై గురునాథ రెడ్డి ఇది వరకే హైకోర్టుకు లేఖ రాయగా, తాజాగా శ్రీనివాసులు - చంద్రబాబుకు లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. చంద్రబాబు లావాదేవీలపై ఆయన తోడల్లుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు చిక్కుల్లో పడ్డారనే భావించాల్సి ఉంటుంది.
Ex MP YS Jagan targeted Telugudesam president Nara Chandrababu Naidu as revenge for making allegations against him. MLAs gurunath Reddy and K srinivasulau, belong to YS Jagan group, made wild allegations against Chandrababu. They accused that Chandrababu was involved in scams.