వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నారా లోకేష్ ఎంట్రీని కొట్టేయని చంద్రబాబు

నారా లోకేష్ గురించి అడిగినప్పుడు - హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారని, పార్టీని మెరుగుపరచడానికి ఎవరైనా సరే సలహాలు ఇస్తే, తమ ఉద్దేశాలను చెప్తే పార్టీ అధ్యక్షుడిగా తాను చేయాల్సిందేమిటో చేస్తానని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా విషయాలు తనకు చెప్తే వాటిని పరిష్కరించి, తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. పార్టీని కాపాడి, దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.