చంద్రబాబు ప్లాన్: నారా లోకేష్ యాక్టింగ్

దాదాపు వంద మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. అభ్యర్థుల జాబితా తయారీ బాధ్యతను చంద్రబాబు కొంత మంది పార్టీ సీనియర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. వారు రెండు, మూడు పేర్లతో ఓ జాబితాను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ జాబితా పరిశీలనలో నారా లోకేష్ నిండా మునిగిపోయారని అంటున్నారు.
తండ్రి స్థానంలో ఆ జాబితాను లోకేష్ పర్యవేక్షస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈలోగానే తొలి జాబితాను విడుదల చేయాలనేది ఆయన ఉద్దేశమట. వచ్చే ఎన్నికల్లో బిసిలకు వంద సీట్లు, యువతకు నలభై శాతం సీట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సీనియర్లు జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం.
యువత విషయంలో నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను కూడా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. జాబితా రూపొందించే క్రమంలో టికెట్ లభించనివారిని బుజ్జగించే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెబుతున్నారు. టికెట్లు లభించనివారికి ఏమేమి హామీలు ఇవ్వాలనే విషయాలపై కూడా ఇప్పుడే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications