అంబటి రాంబాబు జగన్‌కు దూరమేనా?

Ambati Rambabu
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా గొంతు చించుకునే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ అంబటి రాంబాబును దూరం పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అంబటి రాంబాబు గతంలో జగన్‌పై అలిగిన విషయం తెలిసిందే. ఎందుకో గానీ అప్పుడు కాస్తా ప్యాచప్ అయినట్లు కనిపించింది. కానీ, అంబటి రాంబాబుపై జగన్ అభిప్రాయం మారలేదని చెప్పడానికి తగిన ఆధారాలు దొరుకుతున్నాయి. గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తుంటే అంబటి రాంబాబు విజయవాడలో కనిపించారు.

పార్టీ పెట్టిన కొత్తలో జగన్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ అంబటి రాంబాబు తళుక్కున మెరుస్తూ వచ్చారు. కానీ, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో కూడా అంబటి రాంబాబు కనిపించడం లేదు. తాజాగా, జగన్‌ను సమర్థిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సాక్షి దినపత్రిక కూడా ప్రచురించలేదు. జగన్‌కు మద్దతుగా చోటామోటా లీడర్లు మాట్లాడే మాటలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే జగన్ సాక్షి అంబటి రాంబాబు మీడియా సమావేశాన్ని కవర్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సిబిఐ జగన్‌కు అండగా ఉన్నవాళ్లను వేధిస్తోందంటూ ఆయన విరుచుకుపడ్డారు. చాలానే మాట్లాడారు. కానీ దానికి సాక్షి దినపత్రికలో స్థానం లభించలేదు. అంబటి రాంబాబు దీన్ని బట్టి జగన్‌కు దూరమైనట్లే భావిస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అని పెద్దలు ఊరికే అనలేదు మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+