గాలి పిఎ అలీఖాన్ ఆస్తి కోట్లపైనే

స్టీల్ మిల్లు, బ్రాహ్మణి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన పనులు చూడడానికి గాలి జనార్దన్ రెడ్డి అలీఖాన్‌ను నియమించుకున్నట్లు సమాచారం. అక్రమ మైనింగ్ గురించి అలీఖాన్‌కు చాలా విషయాలు తెలుసునని సిబిఐ భావిస్తోంది. 60 లక్షల టన్నుల ముడి ఇనుము అక్రమంగా తరలినట్లు అలీఖాన్ ల్యాప్‌టాప్ హార్డ్ డిస్క్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయి నాలుగున్నర నెలలు అవుతోంది. అయినా అలీఖాన్ ఆచూకీ దొరకడం లేదు. అతని కోసం సిబిఐ లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అలీఖాన్ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నామా అనే మీమాంసలో సిబిఐ పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications