వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పావులు కదుపుతున్న కావూరి: గుడ్‌బై చెప్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు తనకు ఎలాంటి పదవులు దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. ఆయన తన అసంతృప్తిని వ్యూహాత్మకంగా ప్రదర్శిస్తున్నారు. పార్టీ పట్ల తన విధేయత చాటుకుంటూనే అధిష్టానంపై పదవి కోసం ఒత్తిడి పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రమంత్రి వర్గంలో తనకు అవకాశం దక్కుతుందని కావూరి ఎప్పటికప్పుడు భావిస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు ప్రతిసారి చుక్కెదురు అవుతుంది.

ఈసారి తప్పకుండా తనకు అవకాశం వస్తుందని భావించారు. కానీ ఆదివారం జరిగిన విస్తరణలో మళ్లీ ఆయనకు షాక్ ఇచ్చింది అధిష్టానం. అదే సమయంలో కేంద్రమంత్రి పురంధేశ్వరికి ప్రమోషన్ ఇచ్చి ఆయనలో మరింత వేడిని రాజేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో కావూరి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారని, దీంతో పురంధేశ్వరి ప్రమోషన్‌పై అధిష్టానం వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందరినీ ఒప్పించిన తర్వాత నాలుగు రోజులకు పురంధేశ్వరికి తిరిగి గురువారం ప్రమోషన్ ఇచ్చారట.

గతంలో చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామన్నప్పుడు కూడా కావూరి తమలాంటి సీనియర్లను వదిలేసి కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడమేమిటని ప్రశ్నించారట. తనకంటే జూనియర్లు అయిన పురంధేశ్వరికి ప్రమోషన్, చిరంజీవికి స్వతంత్ర హోదాలు పదవులు ఇవ్వడంపై ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తాను ఎందుకు అర్హుడును కాదో చెప్పాలని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారట.

అయితే ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాననే కామెంట్ వినిపించకుండా విధేయత చాటుకుంటూనే ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. రాజీనామా పేరుతో రోజుకో పావు కదుపుతున్నారు. లోకసభ సభ్యత్వానికి, మిగతా స్థాయి సంఘం పదవులకు, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సమన్వయ కమిటీకి ఇలా అన్ని పదవులకు రాజీనామా చేశారట. ఒక్క కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మినహా అన్ని పదవులకు రాజీనామా సమర్పించిన ఆయన వాటిని నేరుగా ఆయా కార్యాలయాలకు కాకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారట.

నేరుగా నిర్ణయం తీసుకుంటే పార్టీ నుండి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న విమర్శలు వినిపిస్తాయని భావించిన కావూరి అలాంటి విమర్శలకు అవకాశం లేకుండా ఉండేందుకే రాజీనామాలను అధినేత్రికి పంపించారని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీకి విధేయత చాటుకుంటున్నట్లుగా కూడా ఉంటుంది. ఇంధన విభాగం సంప్రదింపుల కమిటీ, ప్రజాపద్దుల కమిటీ, ఇంధన రంగంపై ఏర్పాటైన కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

ఈ పదవులకు రాజీనామా చేయాలంటే నేరుగా స్పీకర్‌కు ఇవ్వాలి. కానీ ఆయన వ్యూహాత్మకంగా సోనియాకు పంపించారు. పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేసేటప్పుడు అధిష్టానానికి చెబితేనే తన అసంతృప్తి వారికి అర్థమవుతుందని ఆయన ఇలా చేశారని అంటున్నారు. అలక వహించిన కావూరిని బుజ్జగించేందుకు పెద్దలు రంగంలోకి దిగారు. ఈ నెల 6న ఆయనతో చర్చించేందుకు దిగ్విజయ్ సింగ్ సిద్ధమయ్యారు. ఆయనతో జరపబోయే చర్చల్లో కావూరి పార్టీని వీడుతారా లేక కొనసాగుతారా అనే అంశం ఆధారపడి ఉంటుంది.

English summary
Eluru MP Kavuri Sambasiva Rao was disappointed with Congress party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X