కిరణ్ కుమార్ రెడ్డితో జెసి దివాకర్ రెడ్డి రాజీ

JC Diwakar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాజీ పడినట్లు అర్థమవుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన దివాకర్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్నారు. దాన్ని బయట పడనీయకుండా ఇంత కాలం నెట్టుకొస్తూ వస్తున్నారు. అయితే, జిల్లాకు వచ్చే సరికి మంత్రులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అంతకు ముందు తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రి వర్గం నుంచి తీసేయడమో, ఆయన శాఖను మార్చడమో చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు.

మారిన పరిస్థితిలో జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి దగ్గరైనట్లు చెబుతున్నారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలోని తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు జెసి దివాకర్ రెడ్డి అండదండలు అందించడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఏమైనా, ముఖ్యమంత్రి తనదైన ముద్రను వేసి, మరింత బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+