మళ్లీ ఫాంహౌస్‌కు కెసిఆర్: ఒత్తిడికి వ్యూహరచన

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ఫాం హౌస్‌కు వెళ్లిపోయారట. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణవాదం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇక తదుపరి వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. త్వరలో పరకాల నియోజకవర్గం ఉప ఎన్నికల, ఢిల్లీ పెద్దలపై తెలంగాణ కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఆయన తన ఫాం హౌస్‌లో వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ తెరాసను ఖంగుతినిపించింది. దీంతో త్వరలో జరగనున్న పరకాల నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. అక్కడా బిజెపియే గెలిస్తే పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరకాలలో గెలవడానికి కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారట.

మరోవైపు కేంద్రం తెలంగాణపై ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఓ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయ. కేంద్రం ప్రధానంగా ప్రత్యేక ప్యాకేజీపై దృష్టి సారిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలని కెసిఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని పథకం తయారు చేస్తున్నారట.

భవిష్యత్తులో తెలంగాణ కోసం కేంద్రంలో ఎలా హీటెక్కించాలనే అంశాన్ని కెసిఆర్ తన ఫాం హౌస్‌లోని పచ్చని చెట్ల కింద సేద తీరుతూ ఆలోచిస్తున్నారట! ఆయన అక్కడ కుదిరితే చదవడం లేదంటే పచ్చని చెట్ల మధ్య తిరుగుతూ గడుపుతున్నారట. వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నారట. మరి తోట బంగ్లాలో భవిష్యత్తు ప్రణాళిక రచిస్తున్న కెసిఆర్ ఏం చేస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+