లగడపాటి వచ్చారు.. హరీష్‌రావు ఆగారు!

మంగళవారం న్యూఢిల్లీలో అదే జరిగింది. సిద్దిపేట మునిసిపాలిటీకి రాజీవ్ ఆవాస యోజన పథకం నిధుల కోసం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి మహంతిని కలిశారు. అదే సమయంలో అక్కడకు లగడపాటి రాజగోపాల్ వచ్చారు. ఆయన అవే నిధుల కోసం ఎమ్మెల్యే మల్లాది విష్ణును వెంట బెట్టుకొని వచ్చారు.
ప్రోటోకాల్ ప్రకారం పార్లమెంటు సభ్యుడితో ముందు మాట్లాడాల్సి ఉంటుంది. దీంతో లగడపాటితో మొదట మాట్లాడేందుకు అప్పటి వరకు అక్కడే కూర్చున్న హరీష్ రావును మహంతి పక్క గదిలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సూచన మేరకు హరీష్ రావు మహంతి సూచించిన గదిలోకి వెళ్లారు. అనంతరం లగడపాటితో మహంతి మాట్లాడారు. మల్లాది విష్ణు, లగడపాటి వెళ్లిన తర్వాత మహంతి తిరిగి హరీష్ రావును పిలిపించి నిధుల విషయమై మాట్లాడారు.












Click it and Unblock the Notifications