కెసిఆర్‌కు మన్మోహన్ సింగ్ పిలుపు?

ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తనను కలుసుకోవడానికి రావాల్సిందిగా మన్మోహన్ చెప్పారని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తేదీని ప్రకటించడానికే కెసిఆర్‌ను మన్మోహన్ ఆహ్వానించినట్లు వినికిడి. అందువల్ల ఈ సమయంలో తెలంగాణ కోసం ఆందోళనలు అవసరమని, ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారట. కేంద్రం కదలికను బట్టి ఉద్యమం గురించి ఆలోచిద్దామని ఆయన చెబుతున్నట్లు సమాచారం.
సెప్టెంబర్‌లోగా తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు సంబంధించి తనకు సంకేతాలు అందాయని ఆయన గట్టిగా చెబుతూ వస్తున్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మాత్రం అటువంటి సంకేతాలేవీ లేవని అంటున్నారు. అయినా కూడా కెసిఆర్ తన మాటను మార్చడం లేదు. ఉద్యమాలు చేసేవారికి సంకేతాలు వస్తాయి గానీ ఎవరికి పడితే వారికి వస్తాయా అని ప్రత్యర్థులను ప్రశ్నించారు.
తాజాగా, కెసిఆర్ మళ్లీ ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. ఆయన ఉద్యమంపై వ్యూహరచన చేసేందుకే ఫామ్ హౌస్‌లో ఉంటారనేవారున్నారు. అయితే, కెసిఆర్ మాటలను చాలా మంది తెలంగాణ నాయకులు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్ తెలంగాణ వస్తుందని అంత గట్టిగా ఎందుకు చెబుతున్నారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications