వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణను అడ్డుకున్న నారాయణ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణను వెళ్లకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరోక్షంగా అడ్డుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణకు, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తదితరులకు ఆహ్వానం పంపించారు.

బాలకృష్ణ వెళ్లేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడులో కదలిక తెచ్చినట్లుగా ఉందని అంటున్నారు. బాలయ్య హీరోగా కాకుండా ఇప్పుడు టిడిపి నేతగా చలామణి అవుతున్నారు. అలాంటి వ్యక్తి మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళితే... టిడిపికి మచ్చ తెచ్చినట్లేనని, టిడిపికి మద్దతుపై తాము పునరాలోచించాల్సి ఉంటుందనే హెచ్చరికలను నారాయణ పంపించారు.

నారాయణ వ్యాఖ్యలు కరీంనగర్ జిల్లాలో ఉన్న చంద్రబాబును కదిలించాయి. ఆయన వెంటనే తన బావమరిది బాలకృష్ణకు ఫోన్ చేసి మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లవద్దని సూచించారట. గుజరాత్ వెళితే పార్టీకి కలిగే ఇబ్బందులను చంద్రబాబు నందమూరి హీరోకు తెలియజేశారట. దీంతో బాలకృష్ణ కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారట.

బుకింగ్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకున్నారట. నారాయణ వ్యాఖ్యలకు భయపడి బాలయ్య ఆగిపోనప్పటికీ ఆ వ్యాఖ్యలు బాబును ఆందోళనకు గురి చేసి ఉంటాయంటున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి వెళ్దామనుకుంటే ఇప్పుడు బాలయ్య గుజరాత్ వెళితే మొదటికే మోసం వస్తుందని, సిపిఐ దూరం జరిగే అవకాశముందని భావించిన చంద్రబాబు బావమరిదికి ఫోన్ చేసి వెళ్లకుండా ఉండేందుకు నచ్చజెప్పారని అంటున్నారు.

English summary
Actor Balakrishna on Tuesday decided to stay away from Wednesday's ceremony in which BJP leader Modi would be sworn in as CM of Gujarat following a telephone call from TD chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X