వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ ఈటీవీతో ముకేష్ లింక్స్ వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani-Ramoji Rao
తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు ఈటీవీ గ్రూపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంబంధాలు మొదటి సారి బయటి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఈటీవీ గ్రూపులో రిలయన్స్ పెట్టుబడుల గురించి అధికారికంగా మొదటి సారి తెలిసి వచ్చింది. టీవీ18 చేతికి ఈటీవీ ప్రాంతీయ చానెళ్లను అప్పగించే ఒప్పందం సందర్భంగా ఈ లింక్ అధికారికంగా వెలుగు చూసింది. ఈనాడు గ్రూపులో ముకేష్ పెట్టుబడుల గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన మీడియా పదే పదే చెబుతూ వస్తోంది. ఈ డీల్‌ను తప్పు పడుతూ వస్తోంది. ఇటీవల పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లో - రెండేళ్ల కింద ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రామోజీరావును కష్టాల నుంచి బయటపడేసిందని చెప్పారు.

మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిటర్లకు వందలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సమయంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రామోజీ రావుకు సహాయం చేసిందనేది విజయమ్మ ఆరోపణ. నిలేష్ కంపానీ పేరు మీద కంపెనీలను స్థాపించి, రియలన్స్ ఈనాడు గ్రూపులోకి నిధులు మళ్లించిందని విజయమ్మ ఆరోపించారు. కృష్ణా - గోదావరి బేసిన్ బిడ్డింగ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సహాయం చేసినందుకే రామోజీకి రిలయన్స్ పెట్టుబడులు తరలించిందనేది విజయమ్మ చేసిన ఆరోపణ. ఏమైనా, దీన్ని వైయస్ జగన్ వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు.

English summary
Tuesday’s business deal between Reliance Industries Limited and TV18 confirms for the first time the business links between the conglomerate and media baron Ch Ramoji Rao of the Eenadu group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X