హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నికృష్ణతో గొడవను చూపుతున్న తారా చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
హైటెక్ వ్యభిచారం సూత్రధారిగా అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో దిగిన ఫొటోను వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. వైయస్సార్‌తో దిగిన ఫొటోను చూపించి ఆమె చాలా మందిని మోసం చేసినట్లు చెబుతున్నారు. ఆ ఫొటోతో ఆమె బెదిరింపులకు కూడా పాల్పడేదట. తారా చౌదరి వ్యవహారం కేవలం వ్యభిచారం నడిపేందుకు మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. బాధితులను, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసేదని అంటున్నారు.

అయితే తారా చౌదరి తరఫు న్యాయవాది మరో వాదనను ముందుకు తెస్తున్నారు. కావాలని తారా చౌదరిని కేసులో ఇరికిస్తున్నారని వాదిస్తున్నారు. చిన్ని కృష్ణకు తారాచౌదరి భారీగా డబ్బులు ఇచ్చిందని, డబ్బులు ఇవ్వకపోవడంతో తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, చిన్న కృష్ణతో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు తారా చౌదరికి సూచించారని, అందుకు నిరాకరించడంతో ఆమెను ఈ కేసులో ఇరికించారని ఆ న్యాయవాది కోర్టులో వాదించారు.

హైటెక్ వ్యభిచారం కేసు నుంచి బయటపడడానికి తారా చౌదరి చిన్నికృష్ణ వ్యవహారాన్ని ముందుకు తెస్తోంది. తారా చౌదరిపై విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తారా చౌదరి అడ్డాలో నరకయాతన అనుభవించానని చెబుతూ ఆ అమ్మాయి మీడియాకు ఎక్కింది. దీంతో తారా చౌదరి, ప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

తారా చౌదరి వ్యవహారంపై విశాఖ అమ్మాయితో ఓ తెలుగు టీవీ చానెల్ లైవ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలోని పలువురు లైన్లోకి వచ్చి తారా చౌదరి గురించి మాట్లాడారు. ఆమె చేసిన ఆగడాలను వివరించారు. దీంతో తీవ్రమైన దుమారం చెలరేగింది. నిజానికి తారా చౌదరి కూడా ఓ బాదితురాలిగా ఓ సమయంలో ముందుకు వచ్చింది. ఆ తర్వాత తానే బాధితులను తయారు చేసే స్థితికి చేరుకుంది.

English summary
The Banjara Hills police on Wednesday told a Nampally court that Tara Chowdhary, who was accused of forcing a young girl into prostitution, was using her photograph with late chief minister Y.S. Rajasekhar Reddy to commit offenses. The police sought a seven day custody of Tara Chowdhary and her live-in partner Ratineni Durga Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X