నిర్మాత సి. కళ్యాణ్ భాను కిరణ్ బాధితుడే

కళ్యాణ్‌తో భాను మొదటి పరిచయం 2007లో ఏర్పడిందని అంటున్నారు. అయితే, మద్దెలచెర్వు సూరికి సన్నిహితుడైన నిర్మాత మధుసూదన్ రెడ్డి తరఫున భాను కిరణ్ భూవివాదంలో భాను కిరణ్ జోక్యం చేసుకున్నట్లు, ఇందులో అవతలి తరఫున కళ్యాణ్ ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. మధుసూదన్ రెడ్డి తన ఇంట్లోకి చొరబడ్డాడంటూ కళ్యాణ్ మాదాపూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అయితే సూరికి మధుసూదన్ రెడ్డి సన్నిహితుడని తెలుసుకుని వివాదాన్ని పరిష్కారం చేసుకున్నారు.
రక్త చరిత్ర నిర్మాణ క్రమంలోనే కళ్యాణ్ భానుకు దగ్గరయినట్లు ఆ పత్రిక రాసింది. పరిటాల రవికి, సూరికి మధ్య గల ఫాక్షన్ తగాదాలను తెలుసుకోవడానికి అనంతపురం వచ్చిన రామ్ గోపాల్ వర్మ వెంట సూరి, భానులతో పాటు కళ్యాణ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రక్తచరిత్ర 1, 2 తెలుగు హక్కులను కళ్యాణ్ కొనుగోలు చేశారు.
కళ్యాణ్‌కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్‌ను సెటిల్మెంట్లకు డెన్‌గా వాడినట్లు చెబుతారు. తన కుమారులతో ఏర్పడిన తగాదాల పరిష్కారానికి లక్ష్మి ఫిల్మ్స్‌కు చెందిన సుభాష్ చంద్ర బోస్ 2010లో కళ్యాణ్‌ను ఆశ్రయించినట్లు చెబుతారు. బోస్ కుమారుడు ఒకతను భాను అశ్రయించాడట. దీంతో బాలాజీ కలర్ ల్యాబ్‌లోనే ఆ వివాదాన్ని పరిష్కరించారని అధికారులు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications