ఇప్పుడు సూరీడు ఏం చేస్తున్నాడు?

సూరీడు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారట. తాజాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి వచ్చి ఓసారి వార్తల్లోకి ఎక్కారు. అప్పట్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనక నిలబడి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే, ఆయన గురించి పెద్దగా వార్తలు రావడం లేదు.
అయితే, ఖాళీగా ఉండడానికి సూరీడు ఏ మాత్రం ఇష్టపడడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ పెద్దలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అధిష్టానం పెద్దలు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి వాయలార్ రవి పలు మార్లు హైదరాబాదు వచ్చారు.
వాయలార్ రవిని సూరీడు కలుసుకుని నమస్కారం చేశారట. ఆ వెంటన వాయలార్ రవి సూరీడితో కాసేపు ముచ్చటించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ కూడా హైదరాబాదు వచ్చారు. ఆ సమయంలో కూడా సూరీడు ప్రణబ్ ముఖర్జీకి కనిపించారని అంటున్నారు. ఏమైనా, సూరీడు మౌనంగా ఉండడానికి సిద్దంగా లేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications