పోలింగ్ కేంద్రంలో నటి పూజా గాంధీ డ్యాన్స్

వెళ్తే వెళ్లారు గానీ.. మౌనంగా ఉండలేకపోయారు. ఆమె పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడుతూ కూర్చున్నారు. మధ్యమధ్యలో కూనిరాగాలు తీస్తూ, లయబద్ధంగా డాన్సులు చేస్తూ ఏజెంట్లను, ఓటర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో అక్కడికొచ్చిన డీఎస్పీ దివ్య గోపీనాథ్ ఆమెను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అసలు అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం, ఏజెంట్లతో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించడంతో పూజాగాంధీ అక్కడినుంచి వెళ్లిపోయారు.
పూజా గాంధీకి సంజనా గాంధీ అనే పేరు కూడా ఉంది. ముంగరు మాలే, తాజ్ మహల్, బుధివంట వంటి హిట్ సినిమాల్లో ఆమె నటించారు. నిరుడు జనవరి 18వ తేదీన పూజా గాంధీ జనతాదళ్(ఎస్)లో చేరారు. ఆమెను పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.
ఆ తర్వాత పక్కకు తప్పిస్తూ వచ్చారు. జెడిఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌జి దేవెగౌడ కూడా పూజా గాంధీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఆమె సౌకర్యంగా లేరని, ఆమె వేరే పార్టీలో చేరవచ్చునని అప్పట్లో అన్నారు. దీంతో ఆమె పార్టీకి వీడ్కోలు చెప్పారు. బిఎస్సార్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications