వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పెద్దకు ఎంపీ నిలదీత: అప్పుడేం చేశారని షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantha Venkatrami Reddy
ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకోను అనంతపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి నిలదీశారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని, యాభై ఏళ్లుగా సమస్యకు పరిష్కారం లేదంటే ఎంత జఠిలమైనదో అర్థం చేసుకోవచ్చునని, దానిపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని చాకో రెండు రోజుల క్రితం అన్నారు. ఆయన చేసిన ప్రకటనపై అనంత శనివారం నిలదీశారు.

విభజనపై గతంలోను ఇలాగే వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని, ప్రజలంతా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం కోసం ఎవరూ అడగడం లేదని చాకోను ఒకింత నిలదీసినట్లుగానే అడిగారట. పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతం అంటే ప్రజలు అంగీకరించరని, చేస్తే శాశ్వతంగా యుటి చేయాలని.. అలా చేస్తే తెలంగాణవాళ్లు అంగీకరిస్తారా, ఇన్ని సమస్యల నేపథ్యంలో విభజన ఏలా సాధ్యమని ప్రశ్నించారట.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ఇదివరకేం చేశారని ప్రశ్నించారు. ఆయనను సీమాంధ్ర ఎంపీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం అని వస్తున్న మీరు ఇది వరకు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఏ ఉద్యమాలు లేవని వ్యాఖ్యానించారట.

అందుకు ఎంపీలు స్పందిస్తూ.. కలిసుండాలనే ఉద్దేశ్యంతో తాము ఎలాంటి ఆందోళనలకు దిగలేదని, సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని ఎలా బతికిస్తారని, రెండుసార్లు రాష్ట్ర ప్రజలు ఓటేయడం వల్ల అందరం ఇక్కడున్నామని, అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా విభజన ఎలా చేస్తారని ఎంపీలు ప్రశ్నించారు.

English summary
Congress Party senior MP and Ananthapuram leader Anantha Venkatrami Reddy on Satureday questioned PC Chacko on his statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X