బాలికపై రేప్: ఆశారాం బాపు పరారీ
ఇండోర్: బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదాస్పద గురు ఆశారాం బాపు కనిపించకుండా పోయాడు. అరెస్టు తప్పదని భావించి అతను పారిపోయినట్లు భావిస్తున్నారు. అతను అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో గల ఆయన ఆశ్రమాన్ని పోలీసులు సీల్ చేశారు.
ఆశారాం బాపు మద్దతుదారులు మీడియా ప్రతినిధులతో ఘర్షణకు దిగారు. అశ్రమం గేట్ల వద్ద పోలీసులను కాపలా పెట్టారు. గేట్ల వద్ద మీడియా ప్రతినిధులతో ఘర్షణ పడిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆశారాం బాపు మద్దతుదారులు తన మైక్‌ను, కెమెరాను లాక్కున్నారని ఓ టీవి జర్నలిస్టు చెప్పారు. ఆశారాం బాపు మద్దతుదారుల దాడిలో అతను గాయపడ్డాడు. మరో జర్నలిస్టుకు కుట్లు పడ్డాయి. ఉదయం నుంచి ఆశారాం బాపు మద్దతుదారులు అశ్రమానికి వస్తున్నారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది.
జోద్‌పూర్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ఆశారాం బాపు శుక్రవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. శుక్రవారం సాయంత్రం అతను మధ్యప్రదేశ్‌లో బోపాల్ విమానాశ్రయంలో చివరిసారి కనిపించాడు. పోలీసు విచారణ నుంచి గత కొద్దిరోజులుగా తప్పించుకోవడానికి ఆశారాం బాపు ప్రయత్నాలు చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications