వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రదను దువ్వుతున్న కమలదళం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
రాజమండ్రి: రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జయప్రద కోసం బిజెపి నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్, తెలుగుదేశం తరఫున మాగంటి మురళీమోహన్ పోటీ చేయడం ఖాయంగా కనిపించడంతో ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే, తాజాగా ఆమెకు బిజెపి కూడా ఓ ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

రాజమండ్రిలో బిజెపి బలం దృష్ట్యా ఆమె ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఉండవల్లి రాజమండ్రి సీటు నుంచి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు బిజెపి ఈ సీటును గెలుచుకుంది. గిరజాలల వెంకటస్వామి నాయుడు, ఆ తర్వాత సిబిపిబికె సత్యనారాయణ రావు బిజెపి తరఫున పోటీ చేసి గెలిచారు.

రాజమండ్రి సీటులో బిజెపికి గెలిచిన చరిత్ర ఉండడంతో జయప్రద ఆ పార్టీలో చేరే ఆలోచన కూడా చేయవచ్చునని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కన్నా జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరితే బాగుంటుందనే ఆలోచన కూడా ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు.

తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని జయప్రద కచ్చితంగా చెప్పడంతో ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు తప్ప ప్రత్యామ్నాయం లేదని అందరూ భావించినప్పటికీ తాజాగా బిజెపి ప్రత్యామ్నాయం ఆమెకు కనిపిస్తోందని అంటున్నారు. బిజెపి బలం, తన ఇమేజ్ రెండూ కలిసి తాను విజయం సాధించే అవకాశాలున్నాయని జయప్రద అనుకంటున్నట్లు కూడా తెలుస్తోంది.

English summary
nder this backdrop, the inclination of film star-turned MP Jayaprada, who represents Rampur in UP in the present Lok Sabha, the whirlwind coverage of the constituency with different social service activities by another film and TV artiste and TD leader Maganti Murali Mohan (who unsuccessfully contested in the 2009 polls) adds to the aspirations in the next polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X