విభజన: హైదరాబాద్‌కు చిరంజీవి మెలిక

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి చిరంజీవి మరో మెలిక పెట్టారు. హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా చేయాలని ఆయన సూచించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా చేయాలని ఆయన అన్నారు. తమకు హైదరాబాదుపై ఎనలేని అభిమానం ఉందని ఆయన చెప్పారు.

హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలని సిడబ్ల్యుసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజల మూలాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని, అందువల్ల ఆందోళన చేస్తున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వారు ఏ భావనతో ఉన్నారో తాను అదే భావనతో ఉన్నానని చెప్పుకున్నారు. కానీ, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధంగా లేరు.

రాజీనామాలు పరిష్కారం కాదని ఆయన అన్నారు. పదవిలో ఉంటేనే పార్లమెంటులో విభజనపై వాణిని వినిపించగలుగుతామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన ఆందోళనకారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పదవులే ఆధారమని చిరంజీవి అన్నారు. విగ్రహాలను, ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆవేశాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడాలని ఆయన అన్నారు.

చిరంజీవి ప్రకటనపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తీవ్రంగా మండిపడ్డారు. అలాగే, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే చిరంజీవి సూచనను హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ వ్యతిరేకించారు. యుటిగా చేస్తే తాము గాడిదలను కాయాలా అని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+