బాబు అప్పుడు, ఇప్పుడు అంతే!: డిగ్గీ అసహనం

 Digvijay Singh fire at TDP and unhappy with KCR
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల దిగ్విజయ్ సింగ్ సోమవారం తెలుగుదేశం పార్టీ వైఖరిని తప్పుపడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సూచనలు చేశారు. డిగ్గీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రేపటిలోగా (నవంబర్ 5) అన్ని పార్టీలు విభజనపై మంత్రుల బృందానికి (జివోఎం) అభిప్రాయం చెప్పాలని సూచించిన ఆయన టిడిపిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ విభజన విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. ఆంటోని కమిటీని కాంగ్రెసు కమిటీ అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే భేటీకి రాననడం ఏమిటని ప్రశ్నించారు! జివోఎం ఏర్పాటు పైన కూడా టిడిపి ఇలాగే వ్యవహరించిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే రాష్ట్ర ఏర్పాటు జరుగుతోందన్నారు.

అదే సమయంలో కెసిఆర్‌కు సూచనలు చేశారు. కెసిఆర్ పలు డిమాండ్లు ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిగ్గీ స్పందించారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వారికి ఏవైనా డిమాండ్లు ఉంటే మంత్రుల బృందానికి చెప్పాలని సూచించారు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. సీమాంధ్రలో అల్లర్లను చల్లార్చే బాధ్యత జివోఎంకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని కానీ, మాట్లాడే విషయంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారన్న టిడిపి వ్యాఖ్యలను డిగ్గీ కొట్టి పారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+